విఘ్నేశ్వరుడి ఆశీర్వాదంతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు

by srinivas |
విఘ్నేశ్వరుడి ఆశీర్వాదంతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్ రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆటంకాలు, విఘ్నాలు తొలగిపోయి ప్రతి ఇంటా సుఖ సంతోషాలు నిండేలా విఘ్నేశ్వరుడి దీవెనలు లభించాలని ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి ఆకాంక్షించారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

కరోనా నేపథ్యంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది కొన్ని మార్గదర్శకాల నడుమ పండుగను జరుపుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే భక్తిశ్రద్ధలతో పండుగ చేసుకోవాలని కోరారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకట్టవేయడానికి జిల్లా యంత్రాంగానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు. పండుగ సందర్భంగా ప్రజలంతా శాంతి, సామరస్యాలతో జీవించేలా విఘ్నేశ్వరుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Next Story