వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఎమ్మెల్యే రాజీనామా

by Shamantha N |
వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఎమ్మెల్యే రాజీనామా
X

చండీగఢ్: కేంద్ర వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా హర్యానకు చెందిన ఇండియన్ నేషనల్ లోక్‌దల్ (ఐఎన్‌ఎల్‌డీ) ఏకైక ఎమ్మెల్యే అభయ్ చౌతాలా తన పదవికి రాజీనామా చేశారు. బుధవారం తన మద్దతుదారులతో కలసి ట్రాక్టర్‌పై చౌతాలా శాసనసభ‌కు వెళ్లారు. స్పీకర్ జియన్ చంద్ర గుప్తాకు తన రాజీనామా లేఖను సమర్పించారు. చౌతాలా రాజీనామా‌కు స్పీకర్ వెంటనే ఆమోదం తెలిపారు.

నూతన వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని లేకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అభయ్ చౌతాలా ఈ నెల మొదటి వారంలో ప్రకటించారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు తెలుపుతూ స్పీకర్ ఓ లేఖ పంపారు. ఆ లేఖనే రాజీనామాగా భావించి ఆమోదించాలని కోరారు. షరతులతో కూడిన రాజీనామా లేఖను ఆమోదించడం కుదరదంటూ స్పీకర్ తిరస్కరించారు. తాజాగా బుధవారం సరైన రీతిలో రాజీనామా సమర్పించడంతో స్పీకర్ ఆమోదించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ…గణతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీలో జరిగిన హింసకు బీజేపీనే కారణమని ఆరోపించారు.

Advertisement

Next Story