‘ఎమ్మెల్యే శంకర్ నాయక్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి’

by Shyam |
journalist protest
X

దిశ, మహబూబాబాద్ : ప్రజాస్వామ్యంలో పత్రిక స్వేచ్ఛను హరించడం కోసం టీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేస్తోందని జర్నలిస్టులు సోమవారం నల్లా బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. దిశ దినపత్రికలో వచ్చిన వార్తపై నెల్లికుదుర్ జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ వ్యాఖ్యలు నిరసిస్తూ జిల్లా కేంద్రంలో టీయూడబ్ల్యూజేయూ(ఐజేయూ), డబ్ల్యూజేయూ హెచ్-143, టీబ్ల్యూజేఎఫ్, టీజేయూ, ఏంజేయూ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మద్దినేని గుట్టయ్య, గాడిపెళ్లి శ్రీహరి, మట్టూరి నాగేశ్వరరావు, చిర్ర గోని ఉదయ్ ధీర్, సుబ్రహ్మణ్యంలు మాట్లాడుతూ.. ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తున్న అధికార టీఆర్ఎస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులు ఐక్యంగా ఉండి పోరాటాలకు సిద్ధంగా ఉండాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో ముందున్న జర్నలిస్టులపై నేడు స్వరాష్ట్రంలో బెదిరింపులు, కేసులు పెట్టడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో కట్కూరి ప్రసాద్, గొడుగు శ్రీనివాస్, చందా శ్రీనివాస్, జీవన్, జంపాల శ్రీను, కిరణ్, సుమన్, అశోక్, అయోధ్య రామయ్య, మహేష్, రాము నాయక్, గోపి, రాజు, యాకుబ్, సుమన్, కిరణ్, వెంకన్న, యాకన్న పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed