- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరో వివాదంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్.. బీజేపీ నేత సంచలన ఆరోపణ
దిశ, మహబూబాబాద్ టౌన్: జిల్లా కేంద్రం శివారులో మెడికల్ కళాశాల నిర్మాణంలో భాగంగా.. భూములు కోల్పోతున్న గిరిజన రైతులకు మరో చోట భూములు-నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాటోత్ హుస్సేన్ నాయక్ డిమాండ్ చేశారు. మెడికల్ కళాశాల నిర్మాణంలో భూములు కోల్పోతున్న బాబు నాయక్ తండా, సాంక్రియా తండాలకు చెందిన గిరిజన రైతులను ఆయన శనివారం పరామర్శించారు. అనంతరం భూములను పరిశీలించారు.
ఈ సందర్భంగా హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ.. గిరిజన రైతుల భూములను ప్రభుత్వం లాక్కోవడం దుర్మార్గమన్నారు. సర్వే నెంబర్ 551లో 50 ఎకరాలకు పైగా స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ బినామీల పేర్ల పై కొనుగోలు చేసినట్లు తెలుస్తోందని ఆరోపించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. తమ భూములను తీసుకోవద్దంటూ రైతులు ఆందోళన చేస్తుంటే.. 11 మంది మహిళా రైతులను అర్ధరాత్రి అరెస్టు చేసి జైలుకు తీసుకెళ్లడం సిగ్గుచేటన్నారు.
పేద గిరిజన రైతులకు నష్ట పరిహారం చెల్లించేంతవరకు బీజేపీ పోరాటం ఆగదని, ఈ విషయాన్ని రాష్ట్ర అధ్యక్షుడి దృష్టికి తీసుకుపోతానని, రైతులకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ నిలబడుతుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాంచందర్ రావు, వరంగల్ రూరల్ జిల్లా మాజీ అధ్యక్షుడు ఎడ్ల అశోక్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు చీకటి మహేష్, చెల్పూర్ వెంకన్న, వల్లభు వెంకటేశ్వర్లు, యువ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎంపీటీసీ మదన్, జిల్లా నాయకులు మేరెడ్డి సురేందర్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.