- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఈ ప్రభుత్వాల దొంగ నాటకాలు నమ్మొద్దు: ములుగు ఎమ్మెల్యే సీతక్క

దిశ, నెల్లికుదురు: ధాన్యం కొనుగోలు పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దొంగ నాటకాలు ఆడుతున్నాయని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మండల కేంద్రంలో బుధవారం మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి తో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా నెల్లికుదుర్ మండల కాంగ్రెస్ శ్రేణులు భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క, నరేందర్ రెడ్డి లు మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐకేపీ కేంద్రంలో రైతులు పండించిన వడ్లు కొనుగోలు చేయకపోవడంతో రైతాంగం ఆత్మహత్యలకు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతును రాజు చేస్తానన్న కేసీఆర్.. రైతులు మిల్లర్ల కాళ్ళు పట్టుకునే పరిస్థితి తీసుకువచ్చారన్నారు. రైతు గోడు పట్టించుకోని ఇలాంటి ప్రభుత్వం అవసరమా అని నిలదీశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కపట నాటకాలు తెలంగాణ సమాజం గమనిస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బైరు అశోక్ గౌడ్, మాజీ జడ్పీటీసీ హెచ్చు వెంకటేశ్వర్లు, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు నూనవత్ రాధ, డీసీసీ ఉపాధ్యక్షుడు యాదవ రెడ్డి, ఎంపీటీసీల సంఘము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెరుమాండ్ల గుట్టయ్య, ఎస్సి సెల్ జిల్లా నాయకులు తూళ్ళ ప్రణయ్, మండల అధికార ప్రతినిధి మౌనెందర్, పూర్ణచందరు, సతీష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.