జగిత్యాలలో మంత్రిని చెక్ చేసిన ఎమ్మెల్యే

by Shyam |
జగిత్యాలలో మంత్రిని చెక్ చేసిన ఎమ్మెల్యే
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: క్యాబినెట్ హోదాలో మంత్రిగా ఉన్న ఆయన చెక్ చేయించుకోక తప్పలేదు. అయితే, ఈ చెక్ చేసింది మాత్రం పోలీసులు కాదండి. సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే మంత్రిని చెక్ చేసి పంపించారు. అదేంటి ఒకే పార్టీకి చెందిన వారే చెక్ చేసుకోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా. పోలీసులు చేయాల్సిన చెక్ ఎమ్మెల్యే చేయడమేంటని ముక్కున వేలేసుకుంటున్నారా..? ఆ మంత్రి తనకన్నా పెద్ద హోదాలో ఉన్న ప్రముఖుల వద్ద వెళితే చేయాల్సిన చెక్ ఎమ్మెల్యే చేయడం ఏంటని ఆశ్చర్యపడకండి. ఇంతకీ ఏం జరిగిందంటే… రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ గురువారం జగిత్యాల పర్యటనకు వెళ్లారు. అక్కడి నుండి శాపసనసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న డాక్టర్ సంజయ్ కంటి వైద్య నిపుణులు కూడా. పర్యటనలో భాగంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వైద్య శాలకు వచ్చిన మంత్రి ఈశ్వర్‌కు కంటి పరీక్షలు చేశారు. మెడికల్ చెకప్ అయ్యాక మంత్రి అక్కడి నుంచి వచ్చేశారు.

Advertisement

Next Story