- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎమ్మెల్యే సండ్ర రాజీనామా చేయాలి.. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం
దిశ, కల్లూరు : ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య రాజీనామా చేయాలని కల్లూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం కల్లూరు మండలం అధ్యక్షులు లింగనబోయిన పుల్లారావు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా పుల్లారావు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 20 వేలకు పైగా దళిత కుటుంబాలు, పదివేలకు పైగా బీసీ కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. వారి జీవితాల్లో వెలుగులు రావాలంటే స్థానిక ఎమ్మెల్యే రాజీనామా చేయడం ద్వారా వచ్చే ఉప ఎన్నికలే మార్గమని ప్రస్తుతం రాష్ట్రంలో ఈ ట్రెండ్ నడుస్తున్నదని అన్నారు.
బీసీ బంధు పైలెట్ ప్రాజెక్టు సత్తుపల్లికి తీసుకొస్తే బీసీలందరూ మూకుమ్మడిగా సండ్ర గెలుపు కోసం పని చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం మండల సలహాదారు బొడ్డు అప్పయ్య గారు, సంఘ నాయకులు బొడ్డు కృష్ణ, గంగుల నారాయణరావు, కట్ట చందు, గంధం చిరంజీవి, శీను, ఎం.నాగరాజు, సత్యం, నరసింహారావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.