కాంగ్రెస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే.. అదో ‘స్టే’ పార్టీ అంటూ..

by Shyam |   ( Updated:2021-12-16 07:17:33.0  )
mla-saidi-reddy
X

దిశ,హుజూర్ నగర్: అభివృద్దిని అడ్డుకోవడమే కాంగ్రెస్ పార్టీ అజెండాగా మారిందని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని అభివృద్ధి పనులపై కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్టునుండి తెచ్చిన స్టేను ఎత్తివేసే బాధ్యత స్థానిక అఖిలపక్షపార్టీలు నాయకులు తీసుకోవాలని కోరారు. గురువారం హుజూర్‌నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి పనులపై కోర్టులో కేసులు వేస్తు. కాంగ్రెస్ “స్టే”ల పార్టీగా మారిందని విమర్శించారు.

ఎంపీ ఉత్తమ్, ఆ పార్టీ నాయకులు అభివృద్ధి చేయడంలో పోటీపడాలని, ఆటంకాలతో కాదని హితవు పలికారు. నియోజకవర్గంలో రూ.2 కోట్ల రూపాయలతో లిఫ్టు పనులు ప్రారంభిస్తే వాటికి ఆటంకాలు సృష్టించారని మండిపడ్డారు. చివరకు ఆలయాలకు పాలక మండళ్ళు ఏర్పాటు చేసినా అడ్డుకునేందుకు కోర్టులో కేసులు వేశారన్నారు.

దుమ్ముకు కారణం కాంగ్రెస్సే..

హుజూర్ నగర్ పట్టణంలోని దుమ్ముకు కాంగ్రెస్ పార్టీ కారణమన్నారు. 20 ఏళ్ళ కాలంలో ఎన్నడు లేని విధంగా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తీసుకొచ్చామని అన్నారు. 36 కోట్లతో హుజూర్ నగర్ , మఠంపల్లి, నేరేడుచర్ల, చింతలపాలెం మండలలాలలో రోడ్లను పునర్ నిర్మిస్తున్నామని తెలిపారు. నూతనంగా ఆర్డీఓ ఆఫీస్ ఏర్పాటు చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీకి చెందుతుందన్నారు. అర్హులైన పేదలకు ప్రతిఒక్కరికీ మోడల్ కాలనీ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

మరో పది రోజుల్లో ఈఎస్ఐ డిస్సెన్సరీ ప్రారంభిస్తామని ప్రకటించారు. మఠంపల్లి మండలం రాఘవపురంలో ఏర్పాటు చేయనున్న రైల్వే స్టేషన్ కు గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ పేరు పెట్టాలని సిఫార్స్ చేశామన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు చిట్యాల అమర్ నాధ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకటరెడ్డి,కె.ఎల్.ఎన్ రెడ్డి, తండు హరికృష్ణ,రాపోలు నర్సయ్య, దొండపాటి, పచ్చిపాల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed