డిప్యూటీ సీఎం పుష్పా శ్రీవాణి ఇంట్లో మురిసిపోయిన రోజా!

by srinivas |
roja and srivani
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ డిప్యూటీ డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి(34) ఇటీవల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆమెకు ఇది తొలి కాన్పు కాగా, దేశంలోనే డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి శిశువుకు జన్మనిచ్చిన తొలి మహిళగా ఆమె నిలిచారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌తో పాటు సహచర మంత్రులు, వైసీపీ శ్రేణులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే నగరి ఎమ్మెల్యే రోజా ఆదివారం ఉపముఖ్యమంత్రి శ్రీవాణి ఇంట్లో సందడి చేశారు. శ్రీవాణి, పరీక్షిత్ రాజు దంపతులకు పుట్టిన శిశువును దగ్గరికి తీసుకుని ముద్దాడారు. అనంతరం వారికి శుభాకాంక్షలు తెలిపారు.

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా బుట్టాయగూడేనికి చెందిన పుష్పా శ్రీవాణికి శతృచర్ల పరీక్షిత్ రాజుతో 2014లో వివాహమైంది. ఆయన వైఎస్సార్పీపీ అరకు లోక్‌సభ నియోజకవర్గం సమన్వయకుడిగా వ్యవహరిస్తున్నారు. పెళ్లయ్యాక వీరు విజయనగరం జిల్లా జియమ్మవలస మండలం చినమేరంగిలో స్థిరపడ్డారు. భర్త ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చిన పుష్ఫ.. కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించారు.

అసెంబ్లీకి తొలిసారిగా ఎన్నికయ్యే సమయానికి ఆమె వయస్సు 26 ఏళ్లు. ఎన్నికలకు కొద్దిరోజుల ముందే పుష్పా శ్రీవాణికి వివాహమైంది. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 26వేలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో సీఎం జగన్ కేబినెట్‌లో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఏపీ మంత్రివర్గంలో అత్యంత పిన్న వయస్కురాలిగా పుష్పా నిలిచారు.

Advertisement

Next Story

Most Viewed