అసెంబ్లీ కాదు క‌దా.. గేటు కూడా తాకనివ్వం: ఎమ్మెల్యే రోజా

by srinivas |   ( Updated:2021-11-02 20:44:36.0  )
YSRCP-MLA-ROJA
X

దిశ, ఏపీ బ్యూరో: బద్వేలు ఉపఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. వైసీపీ విజయంపై ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన బద్వేలు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీపై ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీని అసెంబ్లీ సీటు కాదు క‌దా….గేటు కూడా తాకనివ్వమని తేల్చి చెప్పారు. ఏ ఎన్నికలైనా… సెంటర్ ఏదైనా వైసీపీదే విజయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ సంక్షేమ పథకాల అమలే తమ పార్టీ గెలుపునకు కారణమని ఆమె స్పష్టం చేశారు. బద్వేలు ఉపఎన్నికలో సింగిల్‌ హ్యాండ్‌తో వైసీపీని గెలిపించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని ఎమ్మెల్యే రోజా అన్నారు.

Next Story