- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మీకు దండం పెడుతున్నా..మాకు అన్యాయం చేయోద్దు: ఎమ్మెల్యే రోజా
దిశ, ఏపీ బ్యూరో: తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఇరు రాష్ట్రాల నేతలు మాటల యుద్ధానికి కాలుదువ్వుతున్నారు. మరోవైపు ఉమ్మడి ప్రాజెక్టుల వద్ద ఇరు రాష్ట్రాలకు చెందిన పోలీసులు భారీగా మోహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇరురాష్ట్రాల మధ్య జలజగడంపై ఏపీఐఐసీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే రోజా స్పందించారు.
‘తెలంగాణ ప్రభుత్వాన్ని చేతులు జోడించి అడుగుతున్నాను. ఏపీకి అన్యాయం చేయొద్దు’ అని వ్యాఖ్యానించారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. విద్యుదుత్పత్తి కోసం ఏపీకి రావాల్సిన నీటిని అక్రమంగా వినియోగించడం సరికాదన్నారు. ఏపీకి అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. జలవివాదంపై ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ పీఎం నరేంద్ర మోడీ, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌లకు లేఖ రాసినట్లు ఎమ్మెల్యే రోజా తెలిపారు.