- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు పర్యటనపై సెటైర్లు వేశారు. చంద్రబాబు తీవ్ర ఫ్రస్టేషన్‌లో ఉన్నారంటూ ధ్వజమెత్తారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. చంద్రబాబును నమ్మి ఓట్లేసిన కుప్పం నియోజకవర్గ ప్రజలకు గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేకపోయారంటూ ధ్వజమెత్తారు. హంద్రీ నీవా ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు కూడా ఇవ్వకుండా అడ్డుకున్నాడని, కుప్పంలో కనీసం ఇళ్లు, కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకోకుండా నియోజకవర్గ ప్రజల అభివృద్ధిని గాలికి వదిలేశారని మండిపడ్డారు.
గత వారం టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభితో బూతు డ్రామాలు ఆడించిన చంద్రబాబు తాజాగా కుప్పంలో బాంబు డ్రామా ఆడించారని ధ్వజమెత్తారు. చంద్రబాబు డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని రోజా మండిపడ్డారు. కుప్పంలో ఏ ఎలక్షన్స్ జరిగినా వార్ వన్ సైడ్ అన్నట్టుగా వైసీపీకే ప్రజలు పట్టంకడతారని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు క్యాడర్ మొత్తం చేజారి పోతుందన్న భయంతో దిగజారుడు రాజకీయాలకు పాల్పడితే చరిత్ర హీనుడిగా మిగిలి పోతారని రోజా హెచ్చరించారు. కుట్రపూరిత రాజకీయాలు చేయడం కాదని దమ్ముంటే డైరెక్ట్‌గా సీఎం జగన్‌ను ఢీ కొట్టాలని రోజా సవాల్ విసిరారు.