15 రోజులుగా హోం క్వారంటైన్‌లో ఉంటున్నా

by Shyam |   ( Updated:2020-08-17 06:21:56.0  )
15 రోజులుగా హోం క్వారంటైన్‌లో ఉంటున్నా
X

దిశ, హుస్నాబాద్: అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని, ఆదుకుంటామని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… గత వారం రోజులుగా కురిస్తున్న భారీ వర్షాలకు మోయతుమ్మెదవాగు, రేణుక ఎల్లమ్మ వాగులు, చెరువులు, కుంటలు పూర్తిగా నిండి అలుగులుపారుతోంది. ఓ వైపు సంతోషం ఉన్నా, మరోవైపు ఇండ్లు, పంటలు, రహదారులు, చెరువులు, కుంటలకు తీవ్ర నష్టం వాటిల్లి ఇబ్బందులు పడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కరోనా నేపథ్యంలో వైద్యుల సూచన మేరకు గత 15 రోజులుగా హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్నానని, ఈ విపత్కర పరిస్థితుల్లో తాను స్వయంగా గ్రామాలను సందర్శించలేక పోతున్నట్టు ఆయన చెప్పారు. దెబ్బతిన్న ఇండ్లు, పంటలు, రహదారులు, చెరువులు, కుంటలకు పడిన గండ్ల మరమ్మత్తుకు నిధులు మంజూరు చేయించడమే కాకుండా, ప్రజలకు ఏ సమస్య వచ్చినా తనకు నేరుగా ఫోన్ చేయొచ్చని ఎమ్మెల్యే రసమయి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed