గోపాల్ యాదవ్‌ను ఆదర్శంగా తీసుకోండి.. ఎమ్మెల్యే పిలుపు

by Shyam |
MLA Prakash Goud
X

దిశ, రాజేంద్రనగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం వల్ల భావితరాలకు మేలు జరుగుతుందని శంషాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ అన్నారు. గతేడాది రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంద్రారెడ్డి నగర్ కాలనీలో వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ సొంత నిధులతో వివిధ రకాల మొక్కలతో పాటు అరటి మొక్కలు నాటించారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ మొక్కలకు అద్భుతంగా కాయలు కాశాయి. దీంతో ఓ అరటి చెట్టుకు కాసిన గెలను కోసి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌కు వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు ప్రతీ గ్రామంలో లక్షలాది మొక్కలు నాటాలని అన్నారు.

మున్సిపల్ వైస్ చైర్మన్ గోపాల్ యాదవ్ నాటించిన అరటి మొక్కలు సంవత్సరం తిరగకముందే అద్భుతమైన పంట పండాయని, అందులో ఓ అరటి గెల నాకు ఇవ్వడం ఎంతో సంతోషాన్నిందన్నారు. గోపాల్ యాదవ్‌ను ఆదర్శంగా తీసుకొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అనంతరం గోపాల్ యాదవ్ మాట్లాడుతూ.. ఏడాది క్రితం నాటిన మొక్కలు అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం చెప్పలేని అనుభూతినిచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మారెడ్డి, నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మన్ దూడల వెంకటేష్ గౌడ్, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రారెడ్డి, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed