- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మున్సిపల్ వార్డులో సమస్యలు పరిష్కరించాలి.. ఎమ్మెల్యే
దిశ వికారాబాద్: మున్సిపల్‌లోని 13,14,22,23వ వార్డుల్లో ఉన్నటువంటి సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అధికారులను ఆదేశించారు. శనివారం ‘మీతో నేను’ కార్యక్రమం నిర్వహించిన అనంతరం, పలు వార్డులో ఆయన సందర్శించి అక్కడ ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోడ్డు పైన నిలుస్తున్న వర్షపు నీరు నిలువకుండా తగు చర్యలు చేపట్టాలని, పాడుబడిన ఇండ్లు వెంటనే కూల్చివేత పనులు ప్రారంభించాలని, మురుగు కాలువలలో నీరు నిలువకుండా శుభ్రంచేసి డిసీల్టింగ్ పనులు నిరంతరం చేయాలన్నారు.
ఖాళీ స్థలాలలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించమని ఆ స్థలం యొక్క యజమానికి తెలియజేయాలన్నారు. కాలనీ మధ్యలో ఉన్న నీటి బావి పై జాలి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పార్కు కోసం కేటాయించిన స్థలంను సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలన్నారు. నీటి ట్యాంకులను నిరంతరం శుభ్రం చేయాలని, మిషన్ భగీరథ నీటి సరఫరాకు అంతరాయం ఉన్న సమయంలోనే నీటి ట్యాంకులను వినియోగించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్, స్థానిక కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.