- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
హుజురాబాద్ రివ్యూకి నన్నెందుకు పిలవలేదు : జగ్గారెడ్డి
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్: హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో సమావేశం వాడివేడిగా సాగింది. ఈ నేపథ్యంలో కేసీ వేణుగోపాల్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాసిన లేఖ సంచలనం రేపుతోంది. లేఖలో హుజురాబాద్ ఓటమి రివ్యూకి నన్ను ఎందుకు పిలవలేదని పేర్కొన్నారు. నామినేషన్లు వేయడానికి ముందురోజు అభ్యర్థిని ప్రకటిస్తారా? అని ప్రశ్నించారు. హైకమాండ్ దృష్టికి ఈ విషయాలు తీసుకెళ్లలేకపోయాను, కనీసం ఈ సమావేశంలోనైనా ప్రశ్నించేవాడిని అని అన్నారు.
Next Story