వలస కార్మికులను ఆదుకుంటాం: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

by Shyam |   ( Updated:2020-04-08 03:00:28.0  )
వలస కార్మికులను ఆదుకుంటాం: ఎమ్మెల్యే జగ్గారెడ్డి
X

దిశ, మెదక్: పేద కుటుంబాలను, వలస కార్మికులను ఆదుకుంటామని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సదాశివపేటలోని ప్రియదర్శిని స్పిన్నింగ్ మిల్ వద్ద వలస కార్మికుల కోసం కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన భోజన ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యేల నిధుల విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, ఈ విషయంపై సీఎం కేసీఆర్‌కు లేఖ కూడా రాసినట్టు ఆయన పేర్కొన్నారు. సదాశివపేటలో నీళ్ల ఎద్దడి తీవ్రంగా ఉందని.. వేసవిలో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ స్పందన, కాంగ్రెస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నిర్మలారెడ్డి పాల్గొన్నారు.

Tags: mla, jagga reddy, meals packets, distribution, sadasivpet

Advertisement

Next Story