గిరిజన గ్రామాలకు అంబులెన్స్‌లు అంకితం చేసిన ఎమ్మెల్యే

by  |
kone
X

దిశ బెజ్జూర్: కొమురం భీం జిల్లా పెంచికలపేట మండలం మురళిగూడెం గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించడంతోపాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తెలిపారు. శనివారం పెంచికలపేట మండలం మురళిగూడెం గ్రామంలో అదనపు కలెక్టర్ వరుణ్‌రెడ్డితో కలిసి సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పర్యటించారు. మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.

మురళిగూడెం గ్రామానికి ప్రభుత్వం 2017 లోనే 23 కోట్లు రూపాయలు మంజూరు చేసిందని, అటవీ అనుమతులు లేక రోడ్డు పూర్తి కాలేదని, త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. మర్రిగూడెం గ్రామానికి సెల్ టవర్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. మంచినీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మారుమూల గ్రామాల రోడ్ల అనుమతి కోసం రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తావించినట్లు అని తెలిపారు. అటవీ అనుమతులు మంజూరు కాగానే పనులు పూర్తి చేస్తామని తెలిపారు. చేతన పౌండేషన్ ఆధ్వర్యంలో అంబులెన్సులు ఎమ్మెల్యే ప్రారంభించారు.

పెంచికలపేట మండలంలోని కమ్మరిరామ్, నందిగాం, జిల్లెడు, మురళిగూడెం గ్రామాలకు అంబులెన్స్‌ను అంకితం చేస్తున్నట్లు తెలిపారు. ఈ అంబులెన్స్‌లను గిరిజన గ్రామాల ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. అనంతరం మురళిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తహశీల్ధార్ ఆంజనేయులు, ఎంపీడీవో గంగా సింగ్, ఎం పి ఓ శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ ఈశ్వరిబాయ్ టీఆర్ఎస్ నాయకులు చౌదరి తిరుపతి, శ్రీనివాస్ సముద్ర తదితరులు పాల్గొన్నారు

Advertisement

Next Story

Most Viewed