ఆ కుటుంబాల్లో భరోసా నింపిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

by Shyam |
MLA Challa Dharma Reddy
X

దిశ, పరకాల: వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం దామెర మండలంలోని కొగిల్వాయి, ల్యాదేళ్ల, పాలకుర్తి, పసరగొండ, ఊరుగొండ, ముస్త్యాలపల్లి గ్రామాల్లో వివిధ కారణాలతో మృతిచెందిన టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శుక్రవారం పరామర్శించారు. అనంతరం మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందజేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, ఎంపీపీ శంకర్, జెడ్పీటీసీ కల్పనాకృష్ణమూర్తి, వైస్ ఎంపీపీ జాకీర్ అలీ, వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రాజు, మండల టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Advertisement

Next Story