గెల్లు శ్రీనివాస్ గెలుపులో వాటివే కీలక పాత్ర : ఎమ్మెల్యే చల్లా

by Shyam |
MLA Challa Dharma Reddy
X

దిశ, కమలాపూర్: హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపును ఎవరూ ఆపలేరని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని శనిగరం గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చల్లా మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ గెలుపులో కీలక పాత్ర పోషించి, అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాయని అన్నారు. చల్లా ధర్మారెడ్డితో పాటు ఇంటింటి ప్రచారంలో హుజురాబాద్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ సతీమణి గెల్లు శ్వేత పాల్గొన్నారు.

Advertisement

Next Story