Breaking News: తీవ్ర విషాదంలో ఎమ్మెల్యే బాల్క సుమన్

by Shyam |   ( Updated:2021-05-28 04:15:34.0  )
Breaking News: తీవ్ర విషాదంలో ఎమ్మెల్యే బాల్క సుమన్
X

దిశ, వెబ్‌డెస్క్: చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌కు పితృ వియోగం కలిగింది. బాల్క సుమన్ తండ్రి, మెట్‌పల్లి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్క సురేష్ హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో కొద్ది సేపటి క్రితం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తండ్రి మృతితో బాల్క సుమన్ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఈ క్రమంలో బాల్క సురేశ్ మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. బాల్క సుమన్‌ను ఫోన్‌లో పరామర్శించిన కేసీఆర్.. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అటు బాల్క సుమన్‌ను పలువురు టీఆర్‌ఎస్ నేతలు పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement

Next Story