తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన స్టాలిన్

by Shamantha N |   ( Updated:2023-09-20 06:01:38.0  )
MK Stalin
X

https://www.youtube.com/watch?v=0HyrmuqXayQ-దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రిగా దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుడు, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో స్టాలిన్‌తో గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ఈ ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా, ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డీఎంకే కూటమి ప్రభుత్వం నేడు కొలువుదీరనుంది. స్టాలిన్‌తో పాటు మరో 34 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సింపుల్‌గా నిర్వహించారు.

మంత్రులు వీళ్లే..

ముఖ్యమంత్రి స్టాలిన్ కేబినెట్‌లో 34 మందికి స్థానం కల్పించారు. సీనియర్లతో పాటు యువకులకు కూడా మంత్రి వర్గంలో స్టాలిన్ అవకాశం కల్పించారు. వారిలో దురైమురుగన్, కెఎన్‌. నెహ్రూ, ఐ.పెరియస్వామి, పొన్ముడి, వేలు, ఎంఆర్‌కే పన్నీర్‌సెల్వం, కేకేఎస్‌ఆర్‌ రామచంద్రన్, తంగం తెన్నరసు, రఘుపతి, ముత్తుస్వామి, పెరయకుప్పన్, టీఎం. అన్బరసన్, ఎంపీ స్వామినాథన్, గీతా జీవన్, అనితా రాధాకృష్ణన్, రాజకన్నప్పన్, కె. రామచంద్రన్, చక్రపాణి, వి. సెంథిల్‌ బాలాజీ, ఆర్‌. గాంధీ, ఎం సుబ్రమణియన్, పి. మూర్తి, ఎస్‌ఎస్‌ శివశంకర్, పీకె. శేఖర్‌బాబు, పళనివేల్‌ త్యాగరాజన్, ఎస్‌ఎం. నాజర్, సెంజి కేఎస్‌ మస్తాన్, అన్బిల్‌ మహేష్‌ పొయ్యామొళి, ఎస్‌వీ గణేశన్, మనో తంగరాజ్, మదివేందన్, కయల్‌విళి సెల్వరాజ్‌ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed