మాకూ ఐపీఎల్ నిర్వహించాలి : మిథాలీ రాజ్

by Shyam |
మాకూ ఐపీఎల్ నిర్వహించాలి : మిథాలీ రాజ్
X

మహిళా క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందని.. టీ20 మహిళా వరల్డ్ కప్ ఫైనల్సే అందుకు ఉదాహరణ అని టీమ్ ఇండియా వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అన్నారు. వచ్చే ఏడాది నుంచి మహిళల ఐపీఎల్‌ను పూర్తి స్థాయిలో ఆరంభించాలని ఆమె బీసీసీఐని కోరారు. మహిళల ఐపీఎల్‌ను ఆరంభించడానికి ఇదే సరైన సమయమని.. నిబంధనల్లో కాస్త మార్పులు చేసి నిడివి తగ్గించైనా వెంటనే ప్రారంభించాలని ఆమె కోరారు.

పురుషుల ఐపీఎల్‌ తుది జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లను అనుమతిస్తారు.. కానీ మహిళల ఐపీఎల్ తుది జట్టులో ఐదుగురు విదేశీ ఆటగాళ్లు ఉండేలా నిబంధనలు మార్చాలని మిథాలీ అభిప్రాయపడ్డారు. ఇండియాలో మహిళా క్రికెటర్లు ఎక్కువ మంది లేనందు వల్ల ఈ నిబంధన సడలించాలని ఆమె కోరారు. అంతే కాకుండా మహిళా జట్లతో ఐపీఎల్ నిర్వహించడం వల్ల మరింత మంది క్రికెటర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఎంత త్వరగా ఐపీఎల్ మొదలు పెడితే మహిళా క్రికెటర్లకు అంత మంచి అవకాశాలు వస్తాయని మిథాలీ చెప్పారు.

Tags: IPL, Women cricket, Mithali Raj, BCCI, WT20

Advertisement

Next Story

Most Viewed