- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సాలెగూడు నుంచి సరిగమలు..
దిశ, ఫీచర్స్ : సాలెపురుగు(స్పైడర్) గూడు అల్లుకునే విధానం చాలా గమ్మత్తుగా ఉంటుంది. సూర్యకాంతిలో మెరిసే ఆ గూడు, దానిపై వజ్రాల్లా మెరిసే మంచు బిందువులను అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అయితే ఫిక్షనల్ క్యారెక్టర్ ‘స్పైడర్’మాన్‌ను అభిమానించేవాళ్లుంటారు కానీ, స్పైడర్‌ను మాత్రం ఇష్టపడరు. పైగా తెలిసీ తెలియక స్పైడర్ వెబ్‌ను డిస్ట్రబ్ చేస్తుంటాం. కానీ ఇకమీదట అలా చేస్తే.. మంచి సంగీత పరికరాన్ని కోల్పోయినట్లే. అదెలా? అనుకుంటున్నారా! ఎంఐటీ(MIT) శాస్త్రవేత్తలు స్పైడర్ వెబ్ నిర్మాణాన్ని సంగీతంలోకి అనువదించారు.
సాలెపురుగులు మాస్టర్ బిల్డర్స్ అని అందరికీ తెలుసు. ఇవి ఎక్కువగా కంపించే తీగల(వైబ్రేట్ స్ట్రింగ్స్) వాతావరణంలో నివసిస్తాయి. ఎందుకంటే స్పైడర్స్ సరిగ్గా చూడలేవు. దీంతో విభిన్న పౌన:పున్యాలు కలిగిన ప్రకంపనల ద్వారానే తమ ప్రపంచాన్ని గ్రహిస్తాయి. నిర్మాణ సమయంలో సాలీడు పట్టు తంతును విస్తరించినప్పుడు లేదా ఫ్లై వెబ్‌ను కదిలించినప్పుడు ఇలాంటి ప్రకంపనలే సంభవిస్తాయి. ఈ క్రమంలో సంగీతంపై ఆసక్తి ఉన్న బ్యూహ్లెర్(ఎంఐటీ శాస్త్రవేత్తల బృందంలో ఒకడు).. స్పైడర్ వెబ్స్ వంటి సహజ పదార్థాల నుంచి సరిగమలు గ్రహించవచ్చా? అని ఆలోచించాడు. సాధారణ మానవ అనుభవానికి భిన్నమైన సంగీత ప్రేరణ కోసం ఈ వెబ్‌లు కొత్త వనరుగా ఉండవచ్చని బ్యూహ్లెర్ అభిప్రాయపడ్డాడు.
పరిశోధన నిమిత్తం శాస్త్రవేత్తలు 2D క్రాస్-సెక్షన్లను సంగ్రహించడానికి లేజర్‌తో సహజ స్పైడర్ వెబ్‌ను స్కాన్ చేసి, ఆపై వెబ్ 3D నెట్‌వర్క్‌ను పునర్నిర్మించడానికి కంప్యూటర్ అల్గారిథమ్‌లను ఉపయోగించారు. ఈ మేరకు స్పైడర్ వెబ్ తంతువులకు వేర్వేరు ధ్వని పౌన:పున్యాలను అప్లయ్ చేస్తూ, ‘నోట్స్’ రూపొందించడానికి పరిశోధకుల బృందం ప్రయత్నించింది. ఈ క్రమంలోనే పరిశోధకులు వీణలాంటి పరికరాన్ని సృష్టించి, ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రత్యక్ష ప్రదర్శనల్లో స్పైడర్ వెబ్ సంగీతాన్ని వాయించారు. ఇతర ప్రయోగాల్లో సాలె గూడును సాగదీసినప్పుడు, వివిధ యాంత్రిక శక్తులకు గురిచేసినప్పుడు వెబ్ శబ్దం ఎలా మారుతుందో పరిశీలించారు.
సాలెపురుగులతో వాటి సొంత భాషలో కమ్యూనికేట్ అయ్యేందుకు కూడా ఈ బృందం ఆసక్తి చూపుతోంది. అందుకోసమే సాలెపురుగులు తమ వెబ్‌ను నిర్మిస్తున్నప్పుడు లేదా తోటి సాలెపురుగులతో కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు కలిగే వెబ్ వైబ్రేషన్లను రికార్డ్ చేస్తున్నారు. అయితే స్పైడర్ వెబ్ సృష్టించే పౌన:పున్యాలన్నీ కూడా మానవ చెవికి సిమిలర్‌గానే అనిపిస్తాయి. కానీ మెషిన్ లెర్నింగ్ అల్గారిథం.. శబ్ధాలను డిఫరెంట్ యాక్టివిటీస్‌లో వర్గీకరిస్తుంది. ప్రాథమికంగా సాలీడు భాష మాట్లాడేందుకు వీలుగా సింథటిక్ సంకేతాలను రూపొందించడానికి పరిశోధకుల బృందం ప్రయత్నిస్తోంది.