- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాగితాల్లోనే ‘భగీరథ’ పనులు.. బయట ‘జీరో’!
దిశ ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీర థ పథకం కాగితాలకే పరిమితమైంది. అధికారుల అ లసత్వం పాలకుల నిర్లక్ష్యమో గాని ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఫ్లోరైడ్ విముక్తిని ప్రసాదించే మిషన్ భగీరథ పథకం నీరుగారిపోతుంది. ఏళ్ల తరబడి ఫ్లోరైడ్ రక్కసితో విలవిలలాడిపోతున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు.. సీఎం కేసీఆర్ ప్రకటించిన మిషన్ భగీ రథ పథకంతో ఎంతో సంబరపడ్డారు. కానీ వారి సం బరం కలగానే మిగిలిపోయింది రాష్ట్ర ప్రభుత్వం 2015, జూన్ 8న ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని చౌటుప్పల్ మండల కేంద్రంలో వాటర్ గ్రిడ్ పైలాన్ ను ఆవిష్కరించి మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించి 3880 కోట్లతో ఈ ప్రాజెక్టును మొదలు పెట్టగా.. ఏండ్లు గడుస్తున్నా నేటికీ ఈ ప్రాజెక్టు పూర్తి కాలేదు.
అయితే అధికారులు మాత్రం లెక్కల్లో 99 శాతం పను లు పూర్తి అయినట్టుగా ప్రభుత్వానికి నివేదించారు. అందులో 95 శాతం మంది ఇళ్లకు తాగునీరు రోజువారీగా సరఫరా అవుతున్నట్టుగా పేర్కొన్నారు. అయి తే ఇటీవల నిర్వహించిన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో అధికారులు నివేదించిన వివరాలన్నీ తప్పులతడక అని తేలడం గమనార్హం. మిషన్ భగీరథ పనులపై అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ప్రశ్నించడం కోసమెరుపు. కొంతమంది లబ్దికో సం మిషన్ భగీరథ పనుల్లో కాంట్రాక్టుల పేరుతో జా ప్యం చేస్తున్నారని.. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారని స్వయంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.
ప్యాకేజీల వారీగా నీళ్లు అందే గ్రామాలివే..
మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు ప్యాకేజీల ద్వారా 3333 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(ఏకెబీఆర్) ప్యాకేజీ ద్వారా 1743 గ్రామాలకు, ఉదయసముద్రం ప్యాకేజి ద్వారా 990 గ్రామాలకు, దామరచర్ల టెయిల్పాండ్ ద్వారా 644 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేయనున్నారు.
అతీగతీ లేని గేట్ వాల్వ్ కేసు..
నకిరేకల్ ఉప డివిజన్ పరిధిలో మిషన్ భగీరథ పథకం లో భాగంగా మంచి నీటిని సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.70 లక్షల విలువైన గేట్ వాల్వ్ లు మంజూరు చేసింది. వాటిని అయిటిపాములలోని ఆర్డబ్ల్యూఎస్ వాటర్ ప్లాంట్‌లో నిల్వ చేశారు. అయితే సరిగ్గా ఏడాదిన్నర క్రితం ఆ గేట్ వాల్వ్‌లు చోరీకి గురయ్యాయి. పోలీసులు సైతం కేసు నమోదు చేసుకున్నారు. అయినా నేటికీ ఆ సామగ్రి జాడ లేకుండా పోయింది. శాఖాపరమైన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇక ఇదే ఉప డివిజన్ పరిధిలో నకిరేకల్, కేతపల్లి, కట్టంగూర్, నార్కట్ పల్లి, చిట్యాల, శాలిగౌరారం మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో 245 గ్రామాలకు మిషన్ భగీరథ నీరు అందాల్సి ఉం ది. అయితే ఈ గ్రామాల పరిధిలో 73,164 నల్లా క నెక్షన్లు ఇవ్వాల్సి ఉంది.
ఈ పథకంలో భాగంగానే ఇం టింటికీ నల్ల ద్వారా నీరు సరఫరా చేసేందుకు 239 ట్యాంకులను నిర్మించారు. అయితే ఇందులో 125 ట్యాంకులు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. మ రో 114 ట్యాంకులు నిరుపయోగంగా మారాయి. న ల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో 12 ట్యాంకులు ని ర్మించి రెండేళ్లు పూర్తి కావస్తోంది. మెయిన్ గ్రిడ్ పనులు చేపట్టకపోవడంతో ట్యాంకులు నిరుపయోగంగా మారాయి. నార్కట్పల్లి మండలం అక్కేనపెల్లి గ్రామానికి నీళ్లు సరఫరా కావడం లేదు. సిబ్బంది నిర్లక్ష్యంతో నీళ్లు సరఫరా కావడం లేదని అధికారులు చెబుతున్నారు. చిట్యాల మున్సిపాలిటీలో నల్లా కలెక్షన్లు 4500 ఉండగా 2500 కనెక్షన్లు మాత్రమే పూర్తయ్యాయి. మండలంలోని నాలుగు గ్రామాలు మినహా మిగిలిన 13 గ్రామాలకు మిషన్ భగీరథ నీళ్లు సరఫరా కావడం లేదు. ఎలికట్టెలోని ఏ ఇంటికి నల్లా కనెక్షన్ ఇవ్వకపోవడంతో నీటి సమస్య ఉగ్రరూపం దాల్చింది. ఆ గ్రామస్తులంతా మిషన్ భగీరథ నీళ్లు అందక అల్లాడిపోతున్నారు.
నల్లగొండ జిల్లాలో ఇదీ పరిస్థితి..
ఒక్క నల్లగొండ జిల్లా విషయానికి వస్తే జిల్లా పరిధి లో రూ.596.33కోట్ల అంచనా వ్యయంతో 974 గ్రామాలకు 3,97,929 నల్లాలను బిగించాల్సి ఉం ది. దాదాపు 4172 కిలో మీటర్ల మేర పైపు లైను పనులు చేయాల్సి ఉంది. ఇందులో లో ఓవర్ హెడ్ ట్యాంకులు లతోపాటు ఇంట్రా పైప్ లైన్ పనులు, ప్రధాన పైప్లైన్ పనులు, నల్లా కలెక్షన్లను చేపట్టాల్సి ఉంది. అయితే ఓవర్హెడ్ ట్యాంకుల విషయానికి వస్తే నల్లగొండ జిల్లా పరిధిలో 1533 ట్యాంకులను నిర్మించాల్సి ఉండగా ఇప్పటివరకు ఒక్క 7 మినహా మిగతా అన్ని నిర్మించామని, 99.47 శాతం లక్ష్యా న్ని పూర్తి చేసినట్టు అధికారులు నివేదికలో పేర్కొ న్నారు. ఇక పైప్లైన్ పనుల విషయానికి వస్తే.. 4172 కిలోమీటర్ల పైపులైన్లు నిర్మించాల్సి ఉండగా, ఇప్పటివరకు 4042 కిలోమీటర్ల మేర పైపులైను పనులు పూర్తి చేసినట్టు సర్వసభ్య సమావేశంలో నివేదించారు.
ఇక నల్లా కలెక్షన్ల విషయానికి వస్తే.. 3,71,629 నల్లా కనెక్షన్లు ఇవ్వాల్సి ఉండగా, 3,57,681 నల్లా కనెక్షన్లు ఇచ్చామని అధికారులు ప్రభుత్వానికి నివేదికను సమర్పించారు. కానీ ప్రజా ప్రతినిధులు జడ్పీ సర్వసభ్య సమావేశంలో మిషన్ భగీరథ పనులు పూర్తి కాకపోవడంపై గళం ఎత్తడంతో అధికారులు బిక్క మొహం వేశారు. సూర్యాపేట జిల్లాలో 860 గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అం దించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ గ్రామాల పరిధిలో 2,35,677 నల్లా కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. పైపు లైను పనుల విషయానికొస్తే.. 1464 కిలోమీటర్ల మేర చేపట్టాల్సి ఉంది. ఇందులో 50 శాతం పనులు సైతం పూర్తి కాలేదు.