ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువకుడు మిస్సింగ్

by Sridhar Babu |   ( Updated:2021-10-01 11:32:38.0  )
young man Missing
X

దిశ,చౌటుప్పల్: ఇంటి నుండి బయలుదేరిన యువకుడు అదృశ్యమైన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామానికి చెందిన పచ్చిపాల యాదయ్యకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు నాగరాజు(22) గురువారం ఉదయం 9 గంటలకు చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో పని ఉన్నదని చెప్పి ఇంట్లో నుండి బయటకు వెళ్లాడు. సాయంత్రం అయినా ఇంటికి చేరుకోకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు అతని నెంబర్‌కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. వెంటనే బంధువులు, స్నేహితుల ఇళ్లలో విచారించగా ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు.

Next Story