3000 మంది కరోనా పేషెంట్లు మిస్సింగ్

by Shamantha N |
3000 మంది కరోనా పేషెంట్లు మిస్సింగ్
X

బెంగళూరు: కరోనా కేసులతో సతమతమవుతున్న కర్ణాటక రాజధాని బెంగళూరు మరోసమస్యను ఎదుర్కొంటున్నది. కరోనా పాజిటివ్ తేలగానే కొందరు తమ మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి కనిపించకుండా పోతున్నారు. వైద్యులు, పోలీసులూ ట్రేస్ చేయలేకుండా మాయమవుతున్నారు. సూపర్ స్ప్రెడర్‌లుగా మారి ఇతరులకు మహమ్మారిని అంటిస్తున్నారు. తర్వాత వారిలో వైరస్ తీవ్రస్థాయికి చేరగానే హాస్పిటళ్లలో బెడ్ల కోసం, ఆక్సిజన్ సిలిండర్ల కోసం పరుగులు తీస్తున్నారని రెవెన్యూ మినిస్టర్ ఆర్ అశోక్ వెల్లడించారు.

ఇప్పటికి కనీసం 3000 మంది కరోనా పేషెంట్లు పరారీలో ఉన్నారని తెలిపారు. ‘ఇలా చేయడం సరి కాదు. కరోనా టెస్టుల్లో పాజిటివ్ తేలినవారు ఎట్టిపరిస్థితుల్లో తమ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయవద్దు. టెలికాలర్లకు అందుబాటులో ఉండాలి. ప్రభుత్వమే ఉచితంగా టీకాలు వేయడం, చికిత్సనందించే పనిని భుజాన వేసుకున్నప్పుడు పేషెంట్లు అందుకు విరుద్ధంగా వ్యవహరించడం ఆమోదయోగ్యం కాదు. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడం వల్ల పోలీసులూ వారి లొకేషన్‌ను ట్రేస్ చేయలేకపోతున్నారు’ అని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed