ఈ డ్రైవర్ సమయస్ఫూర్తి వల్ల వరంగల్ లో తప్పిన పెను ప్రమాదం

by Sumithra |   ( Updated:2021-11-11 02:58:06.0  )
Gaddi-vaamu-Dhagdham-125
X

దిశ, కొత్తగూడ: గడ్డిని డీసీఎం వాహనంలో తరలిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో గడ్డి దగ్ధమైన ఘటన కొత్తగూడ మండలంలోని పొగుళ్లపల్లి గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే… మండలం లోని పొగుళ్ళపల్లి శివారు చక్రాల తండా నుండి ఇల్లందుకి డీసీఎం వాహనంలో గడ్డిని తీసుకెళ్లేందుకు గురువారం ఉదయం సిద్ధమయ్యారు. చక్రాల తండా నుంచి గడ్డిని పెద్ద మొత్తంలో లోడ్ చేసుకుని కొత్తగూడ మీదుగా వెళ్లడానికి బయలుదేరారు. లోడ్ తో వస్తున్న డీసీఎం వాహనానికి విద్యుత్ తీగలు తగలడంతో మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గమనించిన డ్రైవర్ కంగారు పడకుండా సమయస్ఫూర్తిగా వ్యవహరించాడు. వాహనాన్ని అక్కడ ఆపకుండా నేరుగా తీసుకెళ్లి లోలెవల్ కాజ్ వే ఉన్న దగ్గర నిలిపాడు. వెంటనే స్పందించిన స్థానికులు మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో పెను ప్రమాదం తప్పిందని వారు తెలిపారు.

Advertisement

Next Story