పేరెంట్స్ బలవంతంతోనే.. ప్రెగ్నెంట్ అయిన 13 ఏళ్ళ బాలిక

by Anukaran |   ( Updated:2021-04-11 05:24:17.0  )
పేరెంట్స్ బలవంతంతోనే.. ప్రెగ్నెంట్ అయిన 13 ఏళ్ళ బాలిక
X

దిశ, వెబ్ డెస్క్ : 18 ఏళ్లు నిండకుండా ఆడపిల్లకు పెళ్లి చేస్తే చట్టరీత్యా నేరమని తెలిసినా కొంతమంది తల్లిదండ్రులు మైనర్ బాలికలకు పెళ్లి చేస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. ఒక 13 ఏళ్ళ మైనర్ బాలికకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడు ఒక ప్రబుద్దుడు. అడ్డు చెప్పాల్సిన తల్లిదండ్రులు సైతం ఆమెను పెళ్లి చేసి పంపించేశారు. పెళ్లి తర్వాత ఆ బాలికను బలంతంగా లొంగతీసుకుని తల్లిని చేశాడు. అప్పటి వరకు బాగానే ఉన్నా.. బాలిక తల్లి కావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లి, పోలీసులకు చిక్కి, జైలు పాలయ్యాడు. ఈ దారుణ ఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగు చూసింది.

కర్ణాటక రాష్ట్రంలోని రాయకోట ప్రాంతానికి చెందిన బాలికను ధర్మపురి జిల్లా మారండహళ్లి సమీపంలోని చిన్నేగౌండనూరు గ్రామానికి చెందిన దేవరాజ్‌ అనే 24 ఏళ్ళ వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. బాలికకు ఇష్టం లేకపోయినా ఆమెను బలవంతంగా లొంగదీసుకున్నాడు. దీంతో ఆమె గర్భవతి అయ్యింది. అనారోగ్యంగా ఉన్న బాలికను పక్క గ్రామంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స నిమిత్తం తీసుకువెళ్లాడు. అక్కడి వైద్యులు బాలిక గర్భవతి అయిందని తెలిపి.. ఆమె మైనర్‌ కావడంతో క్రిష్ణగిరి జిల్లా పిల్లల సంక్షేమ శాఖాధికార్లకు సమాచారమిచ్చారు. అధికారులు వెంటనే పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed