- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారతీయ కోచ్‌లకు మహర్దశ
దిశ, స్పోర్ట్స్: భారతీయ కోచ్‌ల వేతనాలపై ఉన్న గరిష్ట పరిమితి నిబంధనను ఎత్తివేస్తూ కేంద్ర క్రీడాశాఖ నిర్ణయం తీసుకుంది. తగిన అర్హత, టాలెంట్ ఉన్న కోచ్‌లకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో వేతనాలపై ఉన్న రూ.2లక్షల నిబంధనను ఎత్తేసింది. ఇప్పటి వరకు భారతీయ కోచ్‌లకు రూ.2లక్షల కంటే ఎక్కువ వేతనం ఇవ్వడానికి నిబంధనలు సహకరించవు. కానీ, ఇకపై ఈ నిబంధనలు ఎత్తివేయడంతో భారతీయ కోచ్‌లు కూడా విదేశీ కోచ్‌ల మాదిరిగా అధిక వేతనాలు పొందే వీలు కలిగింది. ఈ నియమం ఎత్తివేయడం వల్ల స్వదేశీ కోచ్‌లు మరింత మెరుగైన ఫలితాలు రాబట్టేలా ప్రోత్సహం అందించినట్టు ఉంటుందని కేంద్ర క్రీడాశాఖ తెలిపింది. ‘చాలా మంది భారత కోచ్‌లు గొప్ప ఫలితాలను అందిస్తున్నారు. వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాల్సిందే. మేటి అథ్లెట్లను తయారు చేసేందుకు అత్యుత్తమ కోచ్‌లు కావాలనే మేం కోరుకుంటాం. అలాంటప్పుడు వారికి లభించే ఆర్థిక ప్రయోజనాలపై పరిమితి విధించకూడదని భావిస్తున్నాం. ఇకనుంచి నాలుగేళ్లకుగానూ కోచ్‌లతో కాంట్రాక్టు చేసుకుంటాం’ అని కేంద్ర క్రీడాశాఖ మంత్రి రిజిజు వివరించారు. కాగా, కేంద్రం తీసుకున్న నిర్ణయంపై బ్యాడ్మింటన్ హెడ్ కోచ్ పుల్లెల గోపీచంద్ హర్షం వ్యక్తం చేశారు.