పరిపాలన రాజధాని ఏర్పాటుతో ఉత్తరాంధ్ర అభివృద్ది….

by srinivas |
పరిపాలన రాజధాని ఏర్పాటుతో ఉత్తరాంధ్ర అభివృద్ది….
X

దిశ, వెబ్ డెస్క్:
విశాఖ పరిపాలన రాజధాని ఏర్పాటుతో ఉత్తరాంధ్ర అభివృద్ది చెందుతుందని మంత్రి కన్నబాబు అన్నారు. విశాఖ కలెక్టరేట్ లో నిర్వహించిన ఏపీ అవతరణ దినోత్సవ వేడుకలకు మంత్రులు కన్నబాబు , ముత్యంశెట్టి శ్రీనివాస రావు హాజరయ్యారు. పొట్టి శ్రీ రాములు చిత్రపటానికి పూలమాలలు వేసి వారు నివాళులు అర్పించారు. ఈ సంరద్బంగా మంత్రి శ్రీనివాస రావు మాట్లాడుతూ…భోగా పురం ఏయిర్ పోర్టు నిర్మాణమవుతుందని ఆయన అన్నారు. పర్యాటకంగా విశాఖను మరింత అభివృద్ది చేస్తామని ఆయన తెలిపారు. అనంతరం మంత్రి కన్నబాబు మాట్లాడుతూ…కొందరు అడ్డుపడినా అభివృద్ది దిశగా ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఆయన అన్నారు. తెలుగువారు ఎక్కడ ఉన్నా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

Advertisement

Next Story