- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ విషయంపై గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించిన మంత్రులు
దిశ, మహేశ్వరం: పల్లె ప్రగతికి జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తోందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో నూతన బస్టాండ్‌ను మంత్రులు ప్రారంభించారు. అనంతరం 4వ విడుత పల్లె ప్రగతి కార్యక్రమంలో మహేశ్వరం మండలం సిరిగిరిపురం గ్రామంలో పాల్గొన్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. పల్లె ప్రకృతివనం, వైకుంఠదామాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. గ్రామాలల్లో అభివృద్ధి చూసి పట్టణాలకు వెళ్లిన వారంతా మళ్లీ గ్రామాలకు వస్తున్నారని తెలిపారు. గ్రామంలోని సీనియర్ సిటిజన్స్, రిటైర్డ్ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు, యువతను పల్లె ప్రగతిలో భాగస్వామ్యం చేయాలన్నారు.
గ్రామంలోని ప్రతిఒక్కరూ శ్రమదానం చేయాలన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో గ్రామాల రూపురేఖలు మారాయనీ, పంచాయతీలలో నిధుల కొరత లేకుండా అభివృద్ధి దిశలో పయనిస్తున్నయన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, పంచాయతీ రాజ్ కమిషనర్ రఘునందన్ రావు, కలెక్టర్ ఆమోయ్ కుమార్, ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునీత అంద్యానాయక్, మహేశ్వరం గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేష్, సిరిగిరిపురం గ్రామ సర్పంచ్ సురేష్, ఎంపీటీసీలు పోతర్ల సుదర్శన్ యాదవ్, అనురాధ, విజయ్ కుమార్ తదితరులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.