- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వర్షాకాలంలో 3.57లక్షల హెక్టార్ల వరి సాగు తగ్గించాలి
దిశ, నిజామాబాద్:
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాకాలం సాగులో 3.57లక్షల హెక్టార్ల వరి సాగు విస్తీర్ణం తగ్గించి, రైతులను లాభసాటి పంటల వైపు మళ్లించేలా ప్రణాళికలు రచించినట్లు రాష్ర్ట రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.శనివారం నిజామాబాద్ కలెక్టరేట్‌లోని ప్రగతి భవన్‌లో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ..రైతులకు మద్దతు ధర కల్పించడంతో పాటు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు, శాస్త్రవేతల సూచనలు స్వీకరించి నియంత్రిత వ్యవసాయం చేపడుతున్నట్లు వివరించారు.యాసంగీలో 5.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంకు గాను ఇప్పటి వరకు 4.72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, మిగిలిన ధాన్యం రైతులు, సోసైటీల వద్ద ఉందని మంత్రి తెలిపారు. జిల్లా కేంద్రంలోని పసుపు మార్కెట్‌ను ఒకటి, రెండ్రోజుల్లో ప్రారంభిస్తామని స్పష్టంచేశారు.లాక్‌డౌన్ కారణంగా రైతుల వద్ద మిగిలిపోయిన పసుపును కోనుగోలు చేస్తామన్నారు.ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నంత కాలం రైతులు సాగు చేసే పంటలకు రైతు బంధు చెల్లిస్తామని చెప్పారు. కరోనా పరీక్షల నిర్వహణలో జిల్లా ముందుందని, ఇప్పటి వరకు 61 పాజిటివ్ కేసులు నిర్దారణ అవ్వగా, వారంతా కోలుకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 4,747 మందిని హోం క్వారంటైన్‌లో ఉంచామన్నారు. సమావేశంలో ఎమ్మేల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గణేష్ గుప్తా, జెడ్పీ చైర్మెన్ విఠల్ రావు, మార్క్‌ఫెడ్ చైర్మన్ గంగారెడ్డి, డీసీసీబీ చైర్మెన్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.