- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిద్ధిపేట కలెక్టరేట్ భవనం 15లోగా పూర్తి చేయండి
దిశ, న్యూస్‌బ్యూరో: నూతనంగా నిర్మించిన సిద్ధిపేట జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించే అవకాశం ఉన్నందున ఈనెల 15లోపు అన్నిపనులు పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నిజామాబాద్, మారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ల నిర్మాణం పనులు 90శాతం మేర పూర్తైనందున వాటిని ఈనెల 28లోపు ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు.
రాష్ట్రంలోని 26జిల్లాల్లో నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలు ఒక్కోటి దాదాపు లక్ష యాభై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు ప్రారంభమై పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఈ కార్యాలయాల్లో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్‌తో పాటు అందరు అధికారులు ఒకేచోట ఉండడం కారణంగా ప్రజలకు మరింత సౌకర్యవంతమైన సేవలందుతాయని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి పేర్కొన్నారు. సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల నిర్మాణ పురోగతిపై ఉన్నతాధికారులతో వేముల గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. వరంగల్ అర్బన్, జనగాం, రంగారెడ్డి సమీకృత కలెక్టరేట్లు దసరా నాటికి పూర్తి చేసి ప్రారంభించుకోవడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మిగిలిన వాటి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో ఈఎన్సీలు గణపతి రెడ్డి, రవీందర్ రావు, సి.ఈ మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.