హైదరాబాద్ సిగలో మరో అద్భుత నిర్మాణం

by Shyam |   ( Updated:2020-08-16 05:58:02.0  )
హైదరాబాద్ సిగలో మరో అద్భుత నిర్మాణం
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ మహానగరం సిగలో మరో అద్భుత నిర్మాణం చేరిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం హై టెక్ సిటీలోని దుర్గంచెరువుపై రూ.184 కోట్లతో నిర్మించిన కేబుల్ వంతెనను ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోని అతిపెద్ద కేబుల్ వంతెనలలో దుర్గం చెరువు కేబుల్ వంతెన ఒకటిగా నిలుస్తుందని చెప్పారు.

ఇది నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని, రానున్న రోజులలో ఈ ప్రాంతం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. యువనేత, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కృషితోనే ఈ వంతెన నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ఇది ప్రారంభమైతే మైండ్ స్పేస్, జూబ్లీహిల్స్, మాదాపూర్, పైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తదితర ప్రాంతాలకు వెళ్ళే వాహనదారులకు సుమారు 2.5 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని, ట్రాపిక్ రద్దీ సమస్య కూడా పరిష్కారం అవుతుందన్నారు.

Advertisement

Next Story