రాష్ట్రంలో బర్డ్​ ఫ్లూ ఆనవాళ్లు లేవు: తలసాని

by Shyam |
రాష్ట్రంలో బర్డ్​ ఫ్లూ ఆనవాళ్లు లేవు: తలసాని
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ ఆనవాళ్ళు లేవని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బర్డ్ ఫ్లూ వ్యాధికి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులతో మంత్రి బుధవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పక్షులకు సోకే ఈ వ్యాధిని ప్రస్తుతం రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో మాత్రమే గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రకటించారని వెల్లడించారు.

ముందు జాగ్రత్త చర్యలతో రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ ఆనవాళ్ళు లేవని, 1300 రాపిడ్ రెస్పాన్స్ బృందాలు నిరంతర పర్యవేక్షణ జరుపుతూ బర్డ్ ఫ్లూ వ్యాధి ప్రభల కుండా అనేక చర్యలు తీసుకుంటుందని, కోళ్ళ నుండి 276శాంపిల్స్‌ను సేకరించి పరీక్షించామని, అధికారులను ఇప్పటికే అప్రమత్తం చేశామని మంత్రి తెలిపారు. ఈ వ్యాధి ప్రధానంగా పక్షులు, కోళ్ళకు వ్యాపించే అవకాశం ఉందని, రాష్ట్రం కోళ్ళ పరిశ్రమ అభివృద్ధిలో మూడవ స్థానంలో ఉందని, కోళ్ళ పరిశ్రమల నిర్వాహకులకు కూడా పశుసంవర్ధక శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పలు సూచనలు, ఆరోగ్య శిభిరాలను నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. వలస పక్షుల వలన కొంత మేరకు ఈ వ్యాధి కొన్ని ప్రాంతాలలో మాత్రమే ప్రబలే అవకాశం ఉందన్నారు.

Advertisement

Next Story

Most Viewed