సమన్వయంతోనే పాలసేకరణ వృద్ధి

by Shyam |
సమన్వయంతోనే పాలసేకరణ వృద్ధి
X

దిశ,హైదరాబాద్
పాల సేకరణను పెంచేందుకు పశుసంవర్ధక, పశు గణాభివృద్ది, డెయిరీ అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పాల సేకరణ పెంపు, కృత్రిమ గర్భధారణ అమలు తదితర అంశాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ పశుసంవర్ధక, పశు గణాభివృద్ధి, డెయిరీ అధికారులతో జిల్లాల వారిగా సమన్వయ కమిటీ లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. దీర్ఘకాలికంగా ఒకేచోట ఉన్న అధికారులను 10 రోజుల లోగా వేరే చోట్లకు బదిలీ చేయాలని సూచించారు. రాష్ట్రంలో పాల ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. భవిష్యత్ లో విజయ డెయిరీని మరింత ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా ఔట్ లెట్ లను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

tags; minister talasani srinivas yadav review meeting, vijaya dairy,increase milk collection

Advertisement

Next Story