అశ్రునయనాల మధ్య ‘శాంతమ్మ’ అంత్యక్రియలు..

by Shyam |   ( Updated:2021-10-30 10:19:57.0  )
అశ్రునయనాల మధ్య ‘శాంతమ్మ’ అంత్యక్రియలు..
X

దిశప్రతినిధి, మహబూబ్‌నగర్ : తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ఎక్సైజ్, యువజన సర్వీసులు, క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి శాంతమ్మ అంత్యక్రియలు శనివారం సాయంత్రం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న వ్యవసాయ క్షేత్రం వద్ద జరిగాయి. శనివారం ఉదయం శాంతమ్మ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.

అంత్యక్రియలకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంపీలు మన్నె శ్రీనివాస్ రెడ్డి, రాములు, ఎమ్మెల్యేలు డాక్టర్ సి.లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్ రాజేందర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, డాక్టర్ అబ్రహం, అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కాటేపల్లి జనార్దన్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్‌లు స్వర్ణ సుధాకర్ రెడ్డి, వనజ, సరిత, జిల్లా కలెక్టర్ వెంకట్రావు, వివిధ ఉద్యోగ సంఘాల నేతలు, సభ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చి శాంతమ్మ మృతదేహంపై పుష్పగుచ్ఛాలు వేసి నివాళులు అర్పించారు. బంధువులు, అభిమానులు, టీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో శాంతమ్మ అంతిమయాత్ర సాగింది.

Advertisement

Next Story