- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వాళ్లను పరీక్షించాల్సిందేనంటున్న మంత్రి
దిశ, వరంగల్: లాక్‌డౌన్ సమయంలో వలస కూలీల కష్టాలు వర్ణాతీతం. వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి స్వగ్రామాలకు చేరుకున్నా చివరికి నిరాశే ఎదురవుతుంది. గ్రామ పెద్దల ఆంక్షలు కూలీలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కరోనా భయంతో ఆయా గ్రామస్తులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారికి అడ్డుతగులుతున్నారు. వైద్య పరీక్షలు చేయించుకున్న తర్వాతే గ్రామాల్లోకి అనుమతి ఇస్తామని గ్రామస్తులు హుకూం జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి మహబూబాబాద్ జిల్లాకు వచ్చే వలస కూలీలకు తప్పనిసరిగా వైద్య పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. గురువారం జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ గౌతమ్, ఎస్పీ కోటిరెడ్డి, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వలస కూలీలకు పరీక్షలు చేసి.. లక్షణాలు ఉంటేనే క్వారంటైన్‌కు తరలించాలని చెప్పారు. అంతేకాకుండా, కూలీలను రవాణా సౌకర్యం కల్పించి వారి గమ్యస్థానాలకు చేరవేయాలన్నారు.