గర్భిణీ, బాలింతలకు ఇబ్బందులు రానివ్వం: సత్యవతి రాథోడ్

by  |
గర్భిణీ, బాలింతలకు ఇబ్బందులు రానివ్వం: సత్యవతి రాథోడ్
X

దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో అంగన్‌వాడీ కేంద్రాల నుంచి నేరుగా బాలింతలు, గర్బిణీల ఇళ్లకు వెళ్లి సరుకులు పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతుందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కష్టకాలంలో ఎవరూ ఇబ్బంది పడొద్దన్న సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేస్తున్నామన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్ ఎంజీనగర్‌ అంగన్‌వాడీ కేంద్రాన్నిపరిశీలించిన అనంతరం మంత్రి మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇచ్చే పాలు, గుడ్లు, నూనె, పప్పు, బియ్యం, బాలామృతం, నిత్యావసరాలకు ఎలాంటి కొరత లేకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వం పర్యవేక్షణ చేస్తుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పేద ప్రజలకు అందించే సరుకులన్ని సకాలంలో అందించాలని అంగన్‌వాడీ వర్కర్లను మంత్రి ఆదేశించారు. అంగన్‌వాడీల సేవలను నీతి ఆయోగ్ ప్రశంసించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. లబ్దిదారులకు సరుకులను పంపిణీ చేస్తున్న అంగన్‌‌వాడీలందరికీ శానిటైజర్లు, మాస్కులు ఇస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య పాల్లొన్నారు.

Tags: Lockdown, Coronavirus, Minister Satyavathi Rathod, Anganwadis, Sanitizers, Masks, Niti Aayog

Advertisement

Next Story

Most Viewed