- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విపత్కర పరిస్థితుల్లోనూ… అభివృద్ధిని ఆపడం లేదు
దిశ, మహేశ్వరం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న పల్లె ప్రగతి కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం రంగారెడ్డి జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డితో కలిసి కందుకూరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ… ప్రభుత్వం గ్రామాల అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాల ద్వారా, ఒక ఎకరా స్థలంలో 4000 వేల మొక్కలు నాటాలని నిర్ణయించిందని వివరించారు. ప్రతి గ్రామంలో వైకుంఠ ధామాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నూతన రోడ్ల నిర్మాణాలు చేపట్టామని అన్నారు. అంతేగాకుండా రైతుల సంక్షేమం కోసం రైతు వేదికలు నిర్మాణాలు చేపట్టామన్నారు. కరోనా విస్తరిస్తున్న విపత్కర పరిస్థితుల్లోనూ అభివృద్ధి పనులను ఆపడం లేదని స్పష్టం చేశారు.