- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పూల కుండీలను శుభ్రం చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దిశ, రంగారెడ్డి: వర్షాకాలం సమీపిస్తుండటంతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాల పరిశుభ్రత పాటించాలని విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చిన ‘ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు’ అనే కార్యక్రమంలో భాగంగా మంత్రి సబితా తన నివాసంలోని పూల కుండీలను శుభ్రం చేశారు. ఇంటి అవరణలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని మంత్రి సూచించారు. దీనిని ఓ సామాజిక కార్యక్రమంగా భావించేలా ప్రజలను భాగస్వామ్యం చేయాలన్నారు. సీజనల్ వ్యాధుల నివారణలో పురపాలకశాఖ ఇప్పటికే ఒక ప్రత్యేక క్యాలెండర్ రూపొందించిందన్నారు. రానున్న వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా వంటి వ్యాధులు రాకుండా చూడాలని కోరారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశించారని మంత్రి గుర్తుచేశారు.