- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్ : మంత్రి సబితారెడ్డి
దిశ, కొడంగల్: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం కొడంగల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ… కేసీఆర్ పోరాటంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా చరిత్రలో నిలిచిపోయిందన్నారు. ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా మారి ప్రస్తుతం రాష్ట్రంలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఆవిర్భవించిందని అన్నారు. దేశంలో ఉన్న రాష్ట్రాలు అన్ని తెలంగాణ అభివృద్ధి వైపు చూస్తున్నాయన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కారణమని బీజేపీ నాయకులు అనడం సరైంది కాదన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమన్నారు.
బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు తక్కువ లేవని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే పథకాలు తీసుకొచ్చారన్నారు. ‘కేసీఆర్ చావుడో తెలంగాణ వచ్చుడో’ అనే నినాదంతో ఆమరణ నిరాహార దీక్షతో ఆనాటి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. ఈ నెల 15న వరంగల్‌లో నిర్వహించే టీఆర్ఎస్ పార్టీ విజయోత్సవ సభకు నియోజకవర్గం నుండి 209 బస్సు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డితో కలిసి మంత్రి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని, కస్తూర్భా గురుకుల పాఠశాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్, మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి, దౌల్తాబాద్ మండల ఎంపీపీ విజయ్ కుమార్, జెడ్పీటీసీ మహిపాల్, వైస్ ఎంపీపీలు మహిపాల్ రెడ్డి, నారాయణరెడ్డి, మాజీ జెడ్పీటీసీ మోహన్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్‌లు విష్ణువర్ధన్ రెడ్డి, శివ కుమార్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రమోద్ రావు, దామోదర్ రెడ్డి, కోట్ల యాదగిరి, టీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి రాములు నాయక్, సలీం, జెడ్పీటీసీలు నాగరాణి, అరుణ్ దేశ్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నరోత్తం రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు, సర్పంచులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.