‘కోహెడ పండ్ల మార్కెటును అభివృద్ధి చేస్తాం’

by Shyam |
‘కోహెడ పండ్ల మార్కెటును అభివృద్ధి చేస్తాం’
X

దిశ, రంగారెడ్డి: రాబోయే రోజుల్లో కోహెడ పండ్ల మార్కెట్‌ను మరింత అభివృద్ధి చేస్తామని మంత్రులు నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి అన్నారు. హయత్‌నగర్ మండలం కోహెడలో తాత్కాలిక మామిడి పండ్ల మార్కెట్ పనులను ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్‌ రామ్ నర్సింహాగౌడ్‌లతో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ప్రస్తుతం మామిడికాయల సీజన్ దృష్ట్యా తాత్కాలిక పనులు చేపట్టామని తెలిపారు. సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం ఐదెకరాల స్థలం కేటాయించామని, రాబోయే రోజుల్లో మార్కెట్లో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. అంతకుముందు సరూర్‌నగర్ రైతు బజారులో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డిలు పలువురికి బత్తాయి పండ్లు పంపిణీ చేశారు.

Tags:Koheda,fruits market, vistit, Minister,sabita Indra reddy,niranjan reddy

Advertisement

Next Story

Most Viewed