- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టి.వి రావు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం
దిశ,న్యూస్‌బ్యూరో: టీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ) టి.వి రావు ఆకస్మిక మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. గురువారం హైదరాబాద్ ట్రాన్స్‌పోర్ట్ భవన్‌లో జరిగిన సంతాప సభలో పాల్గొన్న మంత్రి.. టి.వి రావు చిత్రపటానికి నివాళులర్పించి ప్రసంగించారు. టి.వి.రావు ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. అయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంస్థలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడమే కాకుండా తనకంటూ టి.వి రావు ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారని కొనియాడారు. సాధారణ డిపో మేనేజర్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఈడీగా ఉన్నత బాధ్యతలు స్వీకరించి ఆ పదవికి వన్నె తీసుకొచ్చిన ఆయన హఠాత్తాగా అసువులు బాయటం అందరిని కలచి వేసిందని పేర్కొన్నారు. సంస్థ పురోభివృద్ధి కోసం పరితపించిన వ్యక్తి తమ మధ్యలో లేకపోవటం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంతాప కార్యక్రమంలో రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, రవాణా కమిషనర్ ఎం.ఆర్.ఎం రావు, టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.