- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
50 లక్షల గన్నీ బ్యాగులు కావాలి: అజయ్
దిశ, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో మొక్కజొన్నల కొనుగోలు, సరుకు రవాణాకు సంబంధించి వివిధ శాఖల అధికారులు, వ్యాపారులతో మంత్రి అజయ్‌కుమార్ సోమవారం టీటీడీసీ హాల్లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో గన్నీ బ్యాగ్స్ సమస్యలపై వ్యవసాయ, మార్కెటింగ్, మార్క్‌ఫెడ్, పౌరసరఫరాల శాఖ, రవాణా, డీఆర్‌డీఏ, సహకార శాఖ(కో-ఆపరేటివ్) జిల్లా అధికారులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, లారీ అసోసియేషన్ అధ్యక్షులతో చర్చించారు. అనంతరం ఆయా సమస్యలపై పువ్వాడ అజయ్.. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మార్క్‌ఫెడ్ జీఎంతో మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. జిల్లాకు 50 లక్షల గన్ని బ్యాగ్స్ అవసరం ఉందని మంత్రి వారికి తెలిపారు. ప్రస్తుతం 5 లక్షలు ఉన్నాయని వివరించారు. అవసరమయ్యే గన్నీ బ్యాగ్స్‌ను సమకూర్చుతామని జీఎం అజయ్‌కు హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలకు, రైతులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని, అధికారులు అందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి అజయ్ ఆదేశించారు.
tag: minister puvvada ajay, review, gunny bags, niranjan reddy, MARKFED G.M, khammam