‘సహజ వనరుల వినియోగంతోనే ఆర్థిక ప‌రిపుష్టి’

by Sridhar Babu |
‘సహజ వనరుల వినియోగంతోనే ఆర్థిక ప‌రిపుష్టి’
X

దిశ‌, ఖ‌మ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్నో స‌హ‌జ వ‌న‌రులు ఉన్నాయి, వాటిని సరైన రీతిలో వినియోగించుకుని స్థానికంగా ఆదాయ వ‌న‌రుల‌ను స‌మ‌కూర్చుకోవాలని ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ అన్నారు. హైదరాబాద్‌లోని మంత్రి కార్యాలయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇసుక రీచ్‌ల వినియోగంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, టీఎస్‌ఎండీసీ చైర్మ‌ెన్ అండ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ మ‌ల్సుర్‌, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం క‌లెక్ట‌ర్ ఎంవీ రెడ్డి, ఎమ్మెల్సీ బాల‌సాని లక్ష్మీ నారాయ‌ణలు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి అజ‌య్ మాట్లాడుతూ.. కొత్తగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 9 ఇసుక రీచ్‌ల ఏర్పాటుకు పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంద‌ని తెలిపారు. గోదావ‌రి న‌ది ప్రాంతంలో 9 రీచ్‌లు ఉన్నాయని, స‌రైన ప్రణాళిక‌తో వాడుకుంటే జిల్లాలో ఇసుక కొర‌త‌ను నివారించ‌వ‌చ్చ‌ని సూచించారు. ఇసుక మైనింగ్ ఎక్కువ‌గా చేయాల‌ని, త‌ద్వారా ట్రైబ‌ల్ యువ‌త బాగుప‌డుతుంద‌న్నారు. మైనింగ్ చేయ‌డం ద్వారా ట్రైబ‌ల్ వారికి కూడా ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించిన వార‌మ‌వుతామ‌న్నారు. ఇసుక ఎంతవ‌ర‌కు అవ‌స‌ర‌మో అంచ‌నా వేయాల‌ని, అందుబాటులో వేబిడ్ర్జిలు ఎన్ని ఉన్నాయో చూసి వాటి ప్రకారం యాక్షన్ ప్లాన్ రూపొందించాలని చెప్పారు. రాబోయే వ‌ర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అంతలోపు పర్యావరణ అనుమతులు తీసుకొని ఇసుక మైనింగ్ చేపడితే జిల్లాలో ఇసుక కొరత లేకుండా చూడొచ్చ‌ని అన్నారు.

Advertisement

Next Story