ఖమ్మంలో ఆర్టీసీ బస్సులో కిరాణా దుకాణం

by vinod kumar |   ( Updated:2020-04-15 03:16:19.0  )
ఖమ్మంలో ఆర్టీసీ బస్సులో కిరాణా దుకాణం
X

దిశ‌, ఖ‌మ్మం: జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైన ఖమ్మం రూరల్ మండలం పెద్దతండాలో కొవిడ్-19 వ్యాప్తిని నియంత్రించడానికి అధికారులు, నాయకులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. వ్యాధి నిర్ధారణ అయినప్పట్నుంచీ ఈ గ్రామాన్ని అధికారులు కంటైన్మెంట్ జోన్‌గా ప‌రిగ‌ణిస్తున్నారు. నిత్యావ‌స‌రాల‌ను అధికారులే ఇంటి వ‌ద్ద‌కు చేరుస్తున్నారు. అయితే గ్రామంలో నెల‌కొన్న ప‌రిస్థితులు, ప్ర‌జ‌ల‌కు అందుతున్న సేవ‌ల‌ను తెలుసుకునేందుకు మంత్రి పువ్వాడ అజ‌య్‌ కుమార్ బుధవారం గ్రామంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా నిత్యావ‌స‌రాలు అందుతున్నాయా..? లేదా..? అంటూ ప‌లువురిని ప్ర‌శ్నించారు. ప్రజలెవ్వరూ ఇంటి నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని సూచించారు. ఏం కావాల‌న్నా అధికారులే అంద‌జేస్తారని హామీ ఇచ్చారు. నిత్యావసర సరుకులకు ఇబ్బందుల్లేకుండా ఆర్టీసీ బస్సు ద్వారా సరుకులు తీసుకొచ్చి, అదే బస్సును కిరాణ దుకాణంగా మార్చామ‌ని వివ‌రించారు. గ్రామంలో వైరస్ వ్యాప్తి జరగకుండా ప్రతిఒక్కరికీ పరీక్షలు నిర్వహించామని స్పష్టం చేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందనీ, నిత్యం గ్రామంలో బ్లీచింగ్ పౌడర్, హైడ్రో క్లోరైట్ ద్రావణం స్ర్పే చేయిస్తున్నట్టు క‌లెక్ట‌ర్ క‌ర్ణ‌న్ తెలిపారు.

Tags : Minister Puvvada Ajay, toured, peddathanda, khammam, RTC BUS, corona

Advertisement

Next Story