- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మోడ్రన్ టాయిలెట్స్ ప్రారంభం
దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన మోడ్రన్ టాయిలెట్స్‌ను ఆదివారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఆదివారం ఖమ్మం నగరంలోని గొల్లగూడెం రోడ్ గాంధీ చౌక్ వద్ద నున్న మహిళా కళాశాలలో నిర్మించిన మోడ్రన్ టాయిలెట్స్‌ను మంత్రి ప్రారంభించారు. ఆగస్టు 15వ తేదీన రెండు డివిజన్లలో టాయిలెట్స్ ప్రారంభించామని, కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలో అనువైన ప్రదేశాల్లో ఆయా నిర్మాణాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఖమ్మం ప్రజలకు సరిపడు టాయిలెట్స్ అతి త్వరలో నిర్మించి అందుబాటులోకి తెస్తామన్నారు. అనంతరం ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో పలు చోట్ల ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్‌ను మంత్రి ప్రారంభించారు. రూ.60లక్షలతో నాలుగు సిగ్నల్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే నగరంలో రూ.50 లక్షల వ్యయంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, మేయర్ పాపాలాల్, సుడా చైర్మన్ విజయ్ కుమార్ మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.