ఒలంపిక్ రన్‌లో మంత్రి పువ్వాడ

by Sridhar Babu |
ఒలంపిక్ రన్‌లో  మంత్రి పువ్వాడ
X

దిశ,ఖమ్మం : ఖమ్మం జిల్లా ఒలంపిక్ అసోసియేషన్, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఒలింపిక్ రన్‌ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. బుధవారం ఉదయం మంత్రి సర్దార్ పటేల్ స్టేడియం వద్ద క్రీడా జ్యోతిని వెలిగించి, జెండా ఊపి కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్.వీ కర్ణన్, మేయర్ పునుకొల్లు నీరజ , సుడా చైర్మన్ విజయ్ , జిల్లా స్పోర్ట్స్ అధికారి పరందామ రెడ్డి , ఏసీపీలు రామోజీ రమేష్ , ఆంజనేయులు , ఒలింపిక్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Next Story